

యష్ తేజ్, జయశ్రీ జంటగా సుజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, ఆర్ఎన్ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కనున్న నూతన ప్రేమకథా చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. చందు దర్శకత్వంలో కె. గోపాల్, జె. రవీందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీఎన్ ఆదిత్య క్లాప్ కొట్టారు. మామిడి హరికృష్ణ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు.
ప్రేమలో ఉన్న యువత తమ తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని తీసుకునే నిర్ణయాలు, ప్రేమికులు తమ తల్లిదండ్రుల గురించి ఎలా ఆలోచిస్తారనే ఆసక్తికర అంశాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని దర్శకుడు చందు తెలిపారు. సరికొత్త ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నందుకు ఆనందంగా ఉందని నిర్మాతలు కె. గోపాల్, జె. రవీందర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి భూపతి యాదగిరి ప్రొడక్షన్ డిజైనర్‌గా, నాగ వంశీ సంగీత దర్శకుడిగా, నాని బిశెట్టి, సురేష్ జిల్లా సినిమాటోగ్రాఫర్లుగా, ఎర్రం రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!