

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా వైవిధ్యమైన పాత్రలతో పాటు ప్రత్యేక గీతాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న ఆమె, ఇటీవల ‘ఓ రొమియో’ సినిమాతో అలరించినప్పటికీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘ది వ్యాన్’ సినిమాలో నటిస్తున్న తమన్నా, తాజాగా మరో భారీ చిత్రాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు ప్రేమకథల్లో మెప్పించిన ఆమె, ఇప్పుడు హారర్ జానర్‌లో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు.
బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘రాగిణి’లో మూడో భాగమైన ‘రాగిణి 3’లో తమన్నా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. క్లాప్‌బోర్డ్ ఫొటోను షేర్ చేస్తూ షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని తమన్నా వెల్లడించారు. ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్‌లో తమన్నాతో పాటు ఆయుష్ శర్మ, ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, నర్గీస్ ఫఖ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శశాంక ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో బాలాజీ మోషన్ పిక్చర్స్, టిప్స్ ఫిల్మ్స్, జై హో మీడియా వెంచర్స్ నిర్మిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!