
సినిమాలు

కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన పీఎంజే జువెలరీ కేసును నూతనంగా ఎంపికైన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) అధికారుల శిక్షణలో అధ్యయన అంశంగా బోధించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అనుసరించిన వ్యూహాలు, సాంకేతిక ఆధారాల వినియోగం, నిందితుల గుర్తింపు, ఆపరేషన్ నిర్వహణ వంటి అంశాలను శిక్షణలో భాగంగా వివరించనున్నారు.
జూలై 18న తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం ఈ కేసు వివరాలను డీఎస్పీ అధికారులకు వివరిస్తారు. మే 3న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జువెలరీ కేసు దర్యాప్తు విధానం పోలీసు అధికారులకు ఆదర్శంగా నిలిచిందని అధికారులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!