
సినిమాలు

అమరావతిలో సమావేశమైన ఎన్డీఏ సమన్వయ కమిటీ కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం లోపు అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, కూటమి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించింది.
ప్రతి 15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఎన్డీఏ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించింది. అలాగే పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!