

తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోహీరోయిన్లు ఇతర నిర్మాతల సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండే విధానంపై సీనియర్ ఫైనాన్షియర్, డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణియం తీవ్రంగా స్పందించారు. అజిత్ కుమార్ తన రేసింగ్ టీమ్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లను చురుకుగా ప్రమోట్ చేస్తారని, నయనతార తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన సినిమాలకు ప్రచారం చేస్తారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇతర నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెట్టిన సినిమాల ప్రమోషన్లకు మాత్రం స్టార్‌లు దూరంగా ఉండటం సరైన విధానం కాదని ప్రశ్నించారు.
స్టార్ హీరోలు భారీ పారితోషికాలు తీసుకుంటూ, తమ సినిమాల ప్రమోషన్లలో పాల్గొనకపోవడంపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. భవిష్యత్‌లో సినిమాల ఒప్పందాల్లోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో స్టార్‌ల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలని సుబ్రమణియం నిర్మాతలకు సూచించారు. భారీ పెట్టుబడులు పెట్టే నిర్మాతలకు స్టార్‌లు సహకరించకపోతే, వారితో కలిసి పనిచేయడంపై నిర్మాతలు సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధానం అమల్లోకి వస్తే కోలీవుడ్‌లో సినిమా మార్కెటింగ్, బిజినెస్ విధానాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!