
జనరల్

పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ విమర్శలు గుప్పించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ “కొత్త ముస్లిం లీగ్”లా వ్యవహరిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంతో వందేమాతరాన్ని అనుసంధానించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఈ నిర్ణయం అవమానించడమేనని నబిన్ అన్నారు.
అయితే కాంగ్రెస్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 1937లో పార్టీ ఆమోదించిన తీర్మానం ప్రకారమే బహిరంగ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను ఆలపించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. దీంతో జాతీయ గీతం, దాని చారిత్రక ప్రదర్శన, రాజకీయ కార్యక్రమాల్లో దాని వినియోగంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మరోసారి రాజకీయ చర్చ మొదలైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!