
సినిమాలు

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘నీ స్నేహం’ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్, జతిన్ గ్రేవాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 19న థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నట్లు కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. ‘Timeless Love Stories Never Fade’ అంటూ విడుదల చేసిన పోస్టర్‌లో హీరోహీరోయిన్ల రొమాంటిక్ లుక్ ఆకట్టుకుంటోంది.
2002లో విడుదలైన ‘నీ స్నేహం’ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహించగా, ఎం.ఎస్. రాజు నిర్మించారు. స్నేహం, ప్రేమ, త్యాగం చుట్టూ సాగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ జంటకు ఈ చిత్రం ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఆర్.పీ. పట్నాయక్ సంగీతం అందించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన పాటలు అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!