
జనరల్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ త్వరలో ‘నూరుసామి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘బిచ్చగాడు’ దర్శకుడు శశి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్వాసిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది.
అయితే ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ ఆంటోనీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. తాను సాధారణ, ప్రశాంత జీవనశైలిని ఇష్టపడతానని, రాబోయే రెండుమూడు సంవత్సరాల్లో పొల్లాచి వంటి ప్రాంతంలో పొలం కొనుగోలు చేసి అక్కడే స్థిరపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఆయన సినిమాలకు దూరం కావచ్చనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!