

తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు తమిళ నటుడు విష్ణు విశాల్ తాజాగా స్పందించారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఓ భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు. గత మూడు నుంచి నాలుగు సంవత్సరాలుగా తాను ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నానని, వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నానని వెల్లడించారు. మందుల ప్రభావం వల్ల ముఖంలో అలసట, శరీరంలో ఉబ్బరం వంటి మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు.
అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ తన పనిపట్ల ఉన్న నిబద్ధత, అభిమానుల ప్రేమ, అలాగే ‘గట్ట కుస్తీ 2’ చిత్ర బృందం కృషి తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అభిమానుల ఆదరణ తనకు ఎంతో బలాన్నిస్తోందని చెప్పిన విష్ణు విశాల్, జూలై 3న విడుదల కానున్న ‘గట్ట కుస్తీ 2’ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!