

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు ‘రోలెక్స్’, ‘ఖైదీ 2’. సూర్య, కార్తీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ సినిమాలపై చాలా కాలంగా చర్చ జరుగుతున్నప్పటికీ, షూటింగ్ ప్రారంభానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. దీంతో ఈ రెండు చిత్రాలు ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తాయనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తన తదుపరి ప్రాజెక్టుల ప్రణాళికల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. అల్లు అర్జున్‌తో తెరకెక్కనున్న చిత్రం, ఆ తర్వాత ‘విక్రమ్ 2’ వంటి ప్రాజెక్టులు ఆయన లైనప్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోలెక్స్, ఖైదీ 2 చిత్రాలపై స్పష్టత రావడం లేదు. చిత్రబృందాల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేవలం ప్రచారంగానే చూడాలని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!