

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’. కీయారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలిరోజుల్లో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది. అయితే కంటెంట్‌పై వచ్చిన మిశ్రమ స్పందన కారణంగా వారం రోజుల్లోనే సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి తగ్గినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ‘టాక్సిక్’ ఓటీటీ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా థియేట్రికల్ రన్‌కు అనుగుణంగా ఈ డీల్ తక్కువ మొత్తానికే పూర్తయినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఈ తేదీపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. రవి బాసృర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ సంయుక్తంగా నిర్మించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!