

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో ఘన విజయాన్ని అందుకుంది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే బాలీవుడ్ థియేట్రికల్ విడుదల నిబంధనల కారణంగా హిందీ వెర్షన్ మాత్రం జూలై 30 తర్వాతే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. థియేటర్లలో విజయాన్ని అందుకున్న ‘పెద్ది’ ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణ పొందుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!