

మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన మీనాక్షి నటరాజన్ దరఖాస్తు తిరస్కరణపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, మీనాక్షి నటరాజన్‌కు సంబంధించిన సమాచారం తెలంగాణ కాంగ్రెస్ నుంచే బయటకు వెళ్లిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం లేదా న్యాయ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశిస్తారా అని ప్రశ్నించారు.
అంతర్గత విభేదాల కారణంగానే ఈ వివాదం తలెత్తిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అలాగే ప్రభుత్వ ఖర్చులపై కూడా ఆయన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి నివాసం సమీపంలో నిర్మించిన భవనం కోసం రూ.100 కోట్లు, భద్రతా కంచెల కోసం రూ.17 కోట్లు, ఫుట్‌బాల్ మైదానం కోసం రూ.10 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రారంభంలో రూ.7 కోట్లు మంజూరు చేసినప్పటికీ, ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా వ్యయం చేశారని పేర్కొన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు లేవని చెబుతూ, ఇలాంటి ఖర్చులు చేయడం సరైందా అని ప్రశ్నించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!