

ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్డీయే కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. ఆ కూటమికి 326 సీట్లు.. అందులో 261 సీట్లు బీజేపీకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో.. ఇండి కూటమికి మరోసారి ఓటమి తప్పదని, ఆ కూటమికి 185 సీట్లే వస్తాయని.. అందులో కాంగ్రెస్‌కు 106సీట్లు వస్తాయని వెల్లడైంది.
ప్రధానిగా మోదీకి 58శాతం మంది ఆమోదం ఉందని తేలింది. సర్వేలో పాల్గొన్నవారిలో 48.7శాతం మంది ప్రధానిగా మోదీకి జైకొట్టగా, 27.1శాతం మంది రాహుల్‌కు ఓటేశారు. అనూహ్యం.. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటివారిని దాటేసి 9.2శాతం మంది మద్దతుతో ప్రధాని రేసులో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నిలవడం విశేషం. చూడ్డానికి బీజేపీకి, ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వస్తున్నట్టు కనిపించవచ్చుగానీ.. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు వంటి అంశాల కాణంగా జెన్‌జీలో ప్రబలుతున్న ఆగ్రహం, ఆవేశం, అసహనం ప్రభుత్వంపై గణనీయంగానే పడుతున్నట్టు కూడా ఈ సర్వే ద్వారా వెల్లడైంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!