
రాజకీయాలు

సోషల్ మీడియా వేదికల వైఖరిపై పార్లమెంటరీ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపు వ్యవహారంపై కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అభ్యంతరకర కంటెంట్‌ను వెంటనే తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత వేదికలను ఆదేశించింది.
ఈ క్రమంలో మెటాకు మూడు రోజుల్లో సంబంధిత కంటెంట్‌ను తొలగించాలని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ వ్యవహారానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ ప్యానల్ సూచించింది. ఆదేశాలను పాటించకపోతే చట్టపరమైన రక్షణ కోల్పోయే అవకాశం ఉందని కమిటీ హెచ్చరించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!