
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కుల రాజకీయాలు, శాంతిభద్రతల పరిస్థితులు, నేరస్థులకు మద్దతు ఇచ్చే నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కులాల ఆధారిత రాజకీయాలు తగ్గితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. గతంలో ఒక దళిత డ్రైవర్ హత్య జరిగినప్పుడు స్పందించని వారు, ఇప్పుడు నేరస్థులపై చర్యలు తీసుకుంటే ఎందుకు ముందుకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ప్రజాప్రతినిధుల పనితీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి సమస్యపై తానే మాట్లాడాల్సి వస్తే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి కేసులో గత ప్రభుత్వ హయాంలో సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరిస్తూ, నేరస్థులపై గట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!