

సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజకుమారి డయానా.. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంపికైన ఆమె తన ఆటతీరు, మాటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో ఆమె చూపించిన ప్రతిభకు ప్రేక్షకులతో పాటు జడ్జీలు కూడా ప్రశంసలు అందించారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను పంచుకుంటూ తనలాంటి మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. దీంతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆమెకు తప్పకుండా అవకాశం దక్కుతుందని చాలామంది భావించారు. అయితే అనూహ్యంగా ఆమెకు హౌస్‌లో చోటు దక్కలేదు.
మరోవైపు కొందరు సోషల్ మీడియా యూజర్లు ఆమె వ్యక్తిగత విషయాలను బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే చెబుతోందంటూ ‘సింపతీ స్టార్’ అని ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్‌పై రాజకుమారి డయానా భావోద్వేగానికి గురయ్యారు. తన పిల్లలు నిద్రిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, తాను ఎదుర్కొంటున్న బాధను వ్యక్తం చేశారు. బయటికి ధైర్యంగా కనిపించినంత మాత్రాన మనసులో బాధ ఉండదని కాదని, తాను కూడా ఒక మనిషినేనని, తనకూ బాధ, కన్నీళ్లు ఉంటాయని తెలిపారు. ఎవరినీ నిందించడం లేదని, ఒక్కసారి తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, పలువురు నెటిజన్లు రాజకుమారికి మద్దతుగా నిలుస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఆమెకు అవకాశం కల్పించి ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!