

తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు తిరుమలలోని శ్రీ అన్నమయ్య భవన్‌లో సమావేశం ప్రారంభం కానుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. తిరుమలలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, రానున్న కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా సమీక్షించే అవకాశం ఉంది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కల్పించాల్సిన ప్రత్యేక ఏర్పాట్లు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సెప్టెంబర్ 16న సీఎం చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో, ఆయన రాక సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా, ఇతర ఏర్పాట్లపై పాలకమండలి చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!