

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2026 పోటీలు జూన్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు ఈ వివరాలను వెల్లడించారు. గత ఏడాది విశాఖపట్నంలో మాత్రమే నిర్వహించిన టోర్నీని ఈసారి విశాఖపట్నం, కడప, మంగళగిరి నగరాలకు విస్తరించినట్లు తెలిపారు. ప్రారంభ మ్యాచ్ విశాఖపట్నంలో జరగగా, ఫైనల్ మ్యాచ్ జూన్ 30న మంగళగిరిలో నిర్వహించనున్నారు.
టోర్నీలో మొత్తం ఏడు జట్లు పాల్గొననున్నాయి. తొలి దశ మ్యాచ్‌లు విశాఖపట్నంలో, రెండో దశ కడపలో, చివరి దశ మంగళగిరిలో నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉచితంగా స్టేడియంలో ప్రవేశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మూడు ప్రాంతాల్లో ఫ్లాష్‌మాబ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసి వారికి అవకాశాలు కల్పించడమే ఏపీఎల్ ప్రధాన లక్ష్యమని ఏసీఏ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!