

2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు అందించాలని యోగి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన. తనకు ఇప్పటివరకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ అందలేదని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి జాకెట్ వచ్చినా తాను ధరించనని, దానిని జర్నలిస్టులకు ఇచ్చేస్తానని సరదాగా వ్యాఖ్యానించారు. తన కంటే అధికార పార్టీ నేతలకే ఇలాంటి రక్షణ ఎక్కువ అవసరమని అన్నారు.
ఎన్నికల నేపథ్యంలో భద్రతా ముప్పు అంచనాల ఆధారంగా 52 మంది ప్రముఖ నాయకులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు అందించాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో సీఎం యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులు ఉన్నారు. ఒక్కో జాకెట్ ధర సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే జాబితాలో ఉన్నప్పటికీ అఖిలేష్ యాదవ్ ఈ రక్షణను స్వీకరించేందుకు నిరాకరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!