
సినిమాలు

ఎఫ్‌ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ 2025-26 టైటిల్‌ను గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా ప్రత్యేక నగదు బహుమతులను ప్రకటించింది. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన జట్టును సత్కరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రకటన ప్రకారం, విజేత జట్టులోని ప్రతి క్రీడాకారిణికి రూ.3 లక్షల చొప్పున, సహాయ సిబ్బందిలోని ప్రతి సభ్యుడికి రూ.1.5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. జట్టు సాధించిన ఈ ఘన విజయాన్ని గుర్తిస్తూ హాకీ ఇండియా తీసుకున్న నిర్ణయానికి క్రీడా వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!