
క్రీడలు

2026 వరల్డ్ రోయింగ్ కప్-IIIలో భారత్ చరిత్ర సృష్టించింది. లైట్‌వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్ విభాగంలో భారత జోడీ ఉజ్వల్ కుమార్, లక్షయ్ స్వర్ణ పతకం సాధించి వరల్డ్ రోయింగ్ కప్ చరిత్రలో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించారు. వీరు 6:26.09 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచారు. హాంకాంగ్ 6:27.14 నిమిషాలతో రజతం, నెదర్లాండ్స్ 6:27.36 నిమిషాలతో కాంస్యం సాధించాయి.
ఉజ్వల్ కుమార్, లక్షయ్ ఇద్దరూ భారత ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్నారు. లుసెర్న్‌లో జరిగిన ఈ టోర్నీకి వెళ్లిన 18 మంది భారత జట్టులో 17 మంది ఆర్మీకి, ఒకరు నేవీకి చెందిన అథ్లెట్ కావడం విశేషం. గత కొన్ని సంవత్సరాలుగా రోయింగ్ క్రీడపై సైన్యం చేసిన పెట్టుబడులు, శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పన ఫలితంగానే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!