
క్రీడలు

భారత జాతీయ క్రికెట్ జట్టు అఫ్గానిస్థాన్‌తో ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ 368/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 197 పరుగులు జోడించి 127 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ (100), శుభ్‌మన్ గిల్ (126) అద్భుత సెంచరీలతో జట్టుకు భారీ స్కోరు అందించారు.
భారత్ తరఫున సాయి సుదర్శన్ (81), రిషభ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో సలీమ్ సాఫి ఆరు వికెట్లతో రాణించగా, రెహమాన్ షరీఫీ, హష్మతుల్లా షాహిదీ తలో వికెట్ సాధించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!