
టెక్నాలజీ

ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ క్రీడాకారిణి తన్వీ శర్మ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన రెండో రౌండ్ పోటీల్లో సింధు 22-20, 21-12 తేడాతో ఇషారాణిపై విజయం సాధించింది. మరోవైపు 17 ఏళ్ల తన్వీ శర్మ 21-13, 21-15తో మాళవిక బన్సోద్‌ను ఓడించి చివరి ఎనిమిది మందిలో స్థానం సంపాదించింది.
పురుషుల డబుల్స్ విభాగంలో ఎం.ఆర్. అర్జున్-హరిహరన్ జోడీ 21-17, 21-7తో న్యూజిలాండ్‌కు చెందిన మైఖెల్ ఒవెన్-డైలాన్ సోయెడ్జాసా జంటపై విజయం సాధించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. అయితే మహిళల సింగిల్స్‌లో తాన్య, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్-మనీష జోడీ పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!