

అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్, వికెట్‌కీపర్ సంజు శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే సమయంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు దక్కింది. దీంతో భారత ఓపెనింగ్ జోడీపై ఆసక్తి నెలకొంది. ఇంగ్లండ్ పర్యటనలో సంజు విఫలమవడంతో అతడిని పక్కన పెట్టి వైభవ్‌కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఇంగ్లండ్‌పై నిరాశపరిచిన వైభవ్ జింబాబ్వేపై మాత్రం సత్తా చాటాడు.
అయితే సంజు తిరిగి రావడంతో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కడం కష్టమయ్యే అవకాశముంది. సీనియర్ ఆటగాళ్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగితే వైభవ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి రావచ్చు. సంజు లేదా అభిషేక్ విఫలమైతేనే వైభవ్‌కు అవకాశం దక్కే పరిస్థితి ఉండొచ్చు. మరోవైపు, వైభవ్ దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్నాడు. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 6 నుంచి 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్థాన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య వైభవ్, ఇషాన్ కిషన్ పూర్తిగా సిద్ధమవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!