
జనరల్

ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మెస్సీ తండ్రి జార్జ్ హొరాసియో మెస్సీ (68) అర్జెంటీనాలోని రొసారియోలో కన్నుమూశారని అంతర్జాతీయ మీడియా నివేదికలు తెలిపాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. అయితే ఆయన మృతికి గల ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడించలేదు.
లియోనెల్ మెస్సీ కెరీర్లో జార్జ్ మెస్సీ పాత్ర ఎంతో కీలకం. చిన్ననాటి నుంచే కుమారుడి ఫుట్బాల్ ప్రయాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన ఆయన, తరువాత అతని ప్రతినిధిగా, సలహాదారుగా వ్యవహరించారు. బార్సిలోనాకు మెస్సీ మారిన సమయంలోనూ ఆయన వెంట ఉన్నారు. ఇటీవల అనారోగ్యంపై వార్తలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం ఆయన మృతి వార్త ధృవీకరించబడింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!