

తెలంగాణ వ్యాప్తంగా దాగి ఉన్న యువ క్రికెట్ ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న టీజీ20 క్రికెట్ లీగ్ తొలి సీజన్‌కు సర్వం సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల 21 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ టోర్నీ ప్రచారకర్తగా వ్యవహరించనుండగా, శ్రీనిధి యూనివర్శిటీ టైటిల్ స్పాన్సర్‌గా ఉంది. జులై 7తో లీగ్ దశ ముగియనుండగా, జులై 9 నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభమై జులై 12న ఫైనల్ నిర్వహించనున్నారు. ప్రారంభ వేడుకల్లో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.
టీజీ20 లీగ్‌ను ఐపీఎల్ తరహాలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మరియు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సాధారణ టికెట్ ధర రూ.50గా, ప్రత్యేక టికెట్ల ధర రూ.100గా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ఈ లీగ్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. టోర్నీ విజేత జట్టుకు రూ.1 కోటి, రన్నరప్‌కు రూ.50 లక్షలు, మూడో మరియు నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో రూ.25 లక్షల ప్రైజ్‌మనీ అందజేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!