

గూగుల్ Android టెక్నాలజీ స్టాక్‌ను ChromeOS డెస్క్‌టాప్ అనుభవంతో కలిపి Googlebook పేరుతో కొత్త ల్యాప్‌టాప్ కేటగిరీని ప్రకటించింది. జెమినీ ఏఐ ఆధారంగా రూపొందించిన ఈ డివైజ్‌లు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో మరింత మెరుగైన అనుసంధానాన్ని అందిస్తాయని కంపెనీ తెలిపింది. Acer, Asus, Dell, HP, Lenovo వంటి సంస్థల నుంచి Googlebook మోడళ్లు రానున్నాయి. మోడల్‌ను బట్టి 2.8K వరకు OLED డిస్‌ప్లేలు, ప్రీమియం మెటీరియల్స్, ప్రత్యేక NPUలు, 14 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందుబాటులో ఉంటాయి.
Googlebook ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర $899గా ఉంది. ప్రస్తుతం అమెరికాలో Google Store, Best Buy, ఎంపిక చేసిన రిటైలర్ల ద్వారా ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 4 నుంచి అమెరికాలో విక్రయాలు ప్రారంభమై, అక్టోబర్ 5 నుంచి కెనడా, బ్రిటన్, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియాలో అందుబాటులోకి రానున్నాయి. భారత్‌లో విడుదల తేదీపై ఇంకా సమాచారం లేదు. కొనుగోలుదారులకు 12 నెలల Google AI Pro సబ్‌స్క్రిప్షన్, 5TB క్లౌడ్ స్టోరేజ్, Gemini Advanced టూల్స్‌తో పాటు YouTube Premium వంటి అదనపు ప్రయోజనాలను గూగుల్ అందిస్తోంది. ఫోన్‌లో ప్రారంభించిన పనులను ల్యాప్‌టాప్‌లో కొనసాగించే Continue On, ఫోన్ యాప్స్‌ను డెస్క్‌టాప్‌లో ఉపయోగించే Cast My Apps, Magic Pointer, Rambler, Create My Widget వంటి ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Android యాప్స్, క్రియేటివ్ యాప్స్, గేమింగ్‌తో పాటు మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!