

మైక్రోసాఫ్ట్ తన ఏఐ ఆధారిత కోపైలట్ కోవర్క్ ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ధరల విధానాన్ని ప్రకటించింది. ఇకపై సంస్థలు స్థిర చందా కాకుండా వినియోగించిన కంప్యూటింగ్ శక్తి ,ఏఐ ప్రాసెసింగ్ ఆధారంగా చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపార అవసరాలకు అనుగుణంగా స్వయంచాలకంగా క్లిష్టమైన పనులను నిర్వహించే ఏజెంటిక్ ఏఐ టూల్స్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సంప్రదాయ చాట్బాట్లతో పోలిస్తే కోపైలట్ కోవర్క్ అనేక డేటా వనరులను ఉపయోగించి స్వయంగా పనులను పూర్తి చేయగలదు. అయితే దీని వల్ల కంప్యూటింగ్ వ్యయం కూడా గణనీయంగా పెరుగుతోంది.
ఖర్చులను తగ్గించేందుకు మైక్రోసాఫ్ట్, డీప్‌సీక్ V4తో పాటు ఇతర ఓపెన్ సోర్స్ ఏఐ మోడళ్లను పరిశీలిస్తోంది. ప్రస్తుతం కోపైలట్ కోవర్క్ కు శక్తినిస్తున్న ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ మోడళ్లకు తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. డీప్‌సీక్ ఆధారిత సేవలను వినియోగించడం పూర్తిగా ఐచ్ఛికమని, వినియోగదారుల డేటా మొత్తం అజ్యూర్ క్లౌడ్‌లోనే భద్రంగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. మూడు నెలల ప్రివ్యూ తర్వాత కోపైలట్ కోవర్క్ను సాధారణ వినియోగానికి అందుబాటులోకి తీసుకురాగా, ఫార్చ్యూన్ 500 సంస్థల్లో సగానికి పైగా ఇప్పటికే ఈ ప్లాట్‌ఫారమ్‌ను పరీక్షించినట్లు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!