

హైదరాబాద్‌కు చెందిన జెన్ టెక్నాలజీస్ తన స్వదేశీ రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తరిస్తూ దేశంలోనే తొలి హై ఆల్టిట్యూడ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ (MPADS)ను ఆవిష్కరించింది. పర్వత ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే భద్రతా దళాలకు రక్షణ కల్పించేలా ఈ తేలికపాటి స్వదేశీ కౌంటర్ యూఏఎస్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు సంస్థ తెలిపింది.
సంప్రదాయ వాహనాలపై అమర్చే యాంటీ డ్రోన్ వ్యవస్థలు వినియోగించడం సాధ్యంకాని క్లిష్టమైన భూభాగాల్లో వేగంగా మోహరించేలా ఈ మ్యాన్ పోర్టబుల్ వ్యవస్థను రూపొందించినట్లు వెల్లడించింది. దీంతో సైనికులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా డ్రోన్ ముప్పును సమర్థంగా ఎదుర్కోగలరని పేర్కొంది.
ఈ వ్యవస్థలో అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ (RF) డిటెక్షన్, ఇంటెలిజెంట్ డేటా ఫ్యూజన్, ఓమ్నీ డైరెక్షనల్ జామింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలు ఉన్నాయి. ఇది 24 గంటల పాటు అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగలదని, సైనికులు, ఆల్ టెరైన్ వెహికిల్స్ (ATVs), అన్‌మ్యాన్డ్ గ్రౌండ్ వెహికిల్స్ (UGVs) ద్వారా సులభంగా తరలించవచ్చని సంస్థ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!