

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు నెలలో మొత్తం 2.98 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయమైనట్లు పరిశ్రమ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈవీ విక్రయాల్లో 52.9 శాతం వృద్ధి నమోదైంది. దీంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
మొత్తం వాహన మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా కూడా పెరిగింది. గతేడాది 9.5 శాతంగా ఉన్న ఈవీల మార్కెట్ వాటా ఆగస్టు నాటికి 12.3 శాతానికి చేరుకుంది. విక్రయాలు, మార్కెట్ వాటా రెండింటిలోనూ నమోదైన ఈ వృద్ధి.. భారతీయ వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతున్నట్లు సూచిస్తోంది. ఈ పరిణామం నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు మరిన్ని ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడంతో పాటు, దేశంలో క్లీన్ మొబిలిటీ విస్తరణకు మరింత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!