
షోస్

చైనాలోని టిబెట్ ప్రాంతంలో 5.3 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావంతో పొరుగు దేశమైన నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ఆయా ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. భూకంపం అనంతరం పరిస్థితులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
భూకంపం కారణంగా తలెత్తే ముప్పులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నేపాల్ ప్రభుత్వం ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. పరిస్థితిపై అధికారులు అప్రమత్తంగా ఉండి, తదుపరి పరిణామాలను పర్యవేక్షిస్తున్నారు. భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం లేదా మరిన్ని ప్రకంపనలు చోటుచేసుకున్నాయా అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!