

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ ఐపీఓ మార్కెట్లో మళ్లీ సందడి మొదలైంది. వచ్చే వారం మెయిన్‌బోర్డ్ విభాగంలో మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలతో పెట్టుబడిదారుల ముందుకు రానున్నాయి. కార్డెలియా క్రూయిజెస్ను నిర్వహిస్తున్న వాటర్‌వేస్ లీజర్ టూరిజం, జైపూర్‌కు చెందిన ఆభరణాల తయారీ సంస్థ అద్వైత్ జువెల్స్, ఐటీ సేవల సంస్థ సీఎస్ఎం టెక్నాలజీస్ ఐపీఓల ద్వారా నిధులు సమీకరించనున్నాయి.
వాటర్‌వేస్ లీజర్ టూరిజం రూ.585 కోట్లను, అద్వైత్ జువెల్స్ రూ.165.16 కోట్లను, సీఎస్ఎం టెక్నాలజీస్ రూ.146 కోట్లను సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మూడు ఇష్యూలు కూడా ప్రధానంగా ఫ్రెష్ షేర్ల జారీ ద్వారానే జరగనున్నాయి. మరోవైపు, జెప్టో రూ.10 వేల కోట్ల భారీ ఐపీఓ, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రూ.13 వేల కోట్ల ఇష్యూతో పాటు ఎన్ఎస్ఈ, రిలయన్స్ జియో సంస్థలు కూడా మార్కెట్లోకి రావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ఐపీఓ మార్కెట్ మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!