
జనరల్

లలితా జ్యువెల్లరీ స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అవసరమైన అనుమతులు పొందిన సంస్థ.. ఆగస్టు 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ఐపీవోను నిర్వహించనుంది. ఒక్కో షేరుకు రూ.190 నుంచి రూ.201 వరకు ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించింది.
ఐపీవో ద్వారా మొత్తం రూ.1,700 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తాజా షేర్ల జారీ ద్వారా రూ.1,200 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.500 కోట్లను సమీకరించనుంది. కంపెనీ విలువను ప్రస్తుతం రూ.11,250 కోట్లుగా నిర్ణయించారు. ఆగస్టు 24న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లలితా జ్యువెల్లరీ షేర్లు లిస్ట్ కానున్నాయి. 1985లో ఆభరణాల విక్రయ రంగంలోకి అడుగుపెట్టిన లలితా జ్యువెల్లరీ ప్రస్తుతం విస్తృతమైన రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!