

కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ క్రీడారంగంలో వ్యవస్థీకృత సంస్కరణలు జరిగాయని తెలిపారు. ప్రతిభను గుర్తించడం, యాంటీ డోపింగ్ నిబంధనలను బలోపేతం చేయడం ద్వారా క్రీడలకు మరింత ప్రోత్సాహం లభించిందన్నారు. గుంటూరులో రూ.14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టామని, క్రీడా బడ్జెట్‌ను రూ.2 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లకు పైగా పెంచినట్లు చెప్పారు.
వచ్చే ఐదేళ్లలో రూ.25 వేల కోట్లతో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని పెమ్మసాని తెలిపారు. ఒలింపిక్ స్థాయి శిక్షణా కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వ క్రీడా విజన్‌కు నిదర్శనమని అన్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. యువతతో నిరంతరం సంభాషిస్తూ వారి అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని, గత పదేళ్లలో భారత్ పతకాల సంఖ్య పెరగడానికి యువతలో పెరిగిన ఆత్మవిశ్వాసం కూడా కారణమని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!