

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కో-లొకేషన్ కేసులను పరిష్కరించుకునేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి రూ.1,491.21 కోట్లు చెల్లించనుంది. క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద సెటిల్‌మెంట్‌గా నిలవనుంది. కేసుల పరిష్కారం కోసం తాము సమర్పించిన సవరించిన ప్రతిపాదనను సెబీ జూలై 30న ఆమోదించినట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. ఈ పరిణామంతో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ప్రక్రియకు ఉన్న అడ్డంకులు తొలగే అవకాశం ఉంది.
ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికే తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా సుమారు రూ.30,000 కోట్లు సమీకరించేందుకు ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది. కో-లొకేషన్ వివాదానికి సంబంధించిన కేసుల పరిష్కారం ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ప్రక్రియను మరింత సులభతరం చేయనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ సెటిల్‌మెంట్‌తో ఎన్‌ఎస్‌ఈపై కొనసాగుతున్న దీర్ఘకాలిక వివాదానికి ముగింపు పలికే దిశగా కీలక అడుగు పడినట్లైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!