

భారత్‌లోని ప్రస్తుత స్టార్టప్‌లు, కంపెనీలకు మద్దతుగా అమలవుతున్న వివిధ పథకాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల కంపెనీలను ఏర్పాటు చేసి, 50 లక్షల వరకు ఉద్యోగాలు సృష్టించవచ్చని మేధో సంపత్తి సంస్థ భారత్ ప్రాజెక్ట్ తెలిపింది. ఇందుకోసం కొత్త పథకాన్ని తీసుకురావడం కంటే, ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, సంస్థలు, పరిశోధన, నైపుణ్యం, మార్కెట్లను అనుసంధానిస్తూ జాతీయ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మిషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ ఎదిగిందని పేర్కొంది.
డీపీఐఐటీ, డీఎస్‌టీ, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ఎంఎస్‌ఎంఈ శాఖ, ఆర్థిక సంస్థల ఆధ్వర్యంలోని పథకాలను ఒక డిజిటల్ వేదికపైకి తీసుకురావాలని సిఫారసు చేసింది. ప్రతి పారిశ్రామికవేత్తకు ఉపయోగపడే ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాస్‌పోర్ట్’, జిల్లా స్థాయిలో ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీ మ్యాప్స్’, జాతీయ స్థాయిలో ‘ఐడియా బ్యాంక్’ ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే ప్రతి నమోదిత ఔత్సాహికుడికి బహుభాషా ఏఐ కోపైలట్, జీఈఎం, ఓఎన్‌డీసీ ద్వారా మార్కెట్ అవకాశాలు కల్పించాలని, విద్యార్థులకు ప్రాక్టికల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విద్యను అందించాలని ప్రతిపాదించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!