

రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (రీట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్) ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ రాబోయే సంవత్సరాల్లో భారీ వృద్ధి సాధించే అవకాశముంది. 2030 నాటికి వీటి ద్వారా రూ.11.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా. మ్యూచువల్ ఫండ్లు, బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్లు వంటి సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు హెచ్ఎన్ఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా భారీగా పాల్గొననున్నరు.
భారత్ ఇన్విట్స్ అసోసియేషన్ ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇన్విట్స్ యూనిట్ హోల్డర్లకు రూ.22,800 కోట్లు పంపిణీ చేయగా, ఇప్పటివరకు మొత్తం పంపిణీ రూ.91,000 కోట్లకు చేరుకుంది. దేశంలో మొత్తం 26 ఇన్విట్స్ ఉండగా, వాటిలో 8 స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. నిర్వహణలోని ఆస్తుల విలువ 2024–25లో రూ.6.3 లక్షల కోట్ల నుంచి 2025–26లో రూ.7.1 లక్షల కోట్లకు పెరిగింది.
2025–26లో ఈక్విటీ జారీ ద్వారా ఇన్విట్స్ రూ.1.97 లక్షల కోట్లు సమీకరించగా, గత సంవత్సరం ఇది రూ.1.75 లక్షల కోట్లుగా ఉంది. యూనిట్ హోల్డర్ల సంఖ్య సుమారు 2 లక్షల మేర పెరిగింది. లిస్టెడ్ ఇన్విట్స్ ఇన్వెస్టర్లు 64 శాతం వృద్ధి చెందారు. 2026 మార్చి నాటికి పరిశ్రమ స్థూల రుణ భారం రూ.3.35 లక్షల కోట్లుగా నమోదైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!