

కాలుష్యంతో నిండిపోయిన అజ్నార్ నదిని శుభ్రం చేసేందుకు 20 ఏళ్ల బిట్టు తబాహి చేపట్టిన ప్రయత్నం ఇప్పుడు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. తన సొంత ప్రాంతంలో నదిని శుభ్రం చేసేందుకు స్వయంగా ముందుకొచ్చిన బిట్టు సేవలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అభినందించారు. ఆయనను సీఎం నివాసానికి ఆహ్వానించి సన్మానించడంతో పాటు.. బిట్టు చేపడుతున్న కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కాలుష్యంతో నిండిన నదిలో పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన బిట్టు.. ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసంలో సన్మానం అందుకోవడం అతడి ప్రయాణంలో కీలక మలుపుగా మారింది. ఒక్క వ్యక్తి నిజాయితీగా చేసే ప్రయత్నం కూడా ఎంతటి మార్పుకు దారితీయగలదో బిట్టు కథ చాటిచెబుతోంది. అతడికి లభించిన ఈ గుర్తింపు మరింత మంది యువత తమ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి ముందుకు రావడానికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!