

కరీంనగర్–వరంగల్ మధ్య నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి NH-563 ట్రయల్ రన్‌కు సిద్ధమైంది. ఈ కొత్త రహదారితో కరీంనగర్–వరంగల్ మధ్య దూరం సుమారు 72 కిలోమీటర్ల నుంచి 68 కిలోమీటర్లకు తగ్గనుంది. కారులో ప్రయాణించే వారికి ట్రాఫిక్, రహదారి పరిస్థితులను బట్టి గంటలోపే గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉండనుంది. దీంతో రెండు నగరాల మధ్య రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి.
హైవే భద్రత, పర్యవేక్షణ కోసం ప్రతి కిలోమీటర్‌కు రెండు సోలార్ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగట్టు టోల్ ప్లాజా నుంచి 24 గంటలూ రియల్‌టైమ్ మానిటరింగ్ చేపట్టనున్నారు. ట్రయల్ రన్ పూర్తయిన అనంతరం అక్టోబర్ 1 నుంచి కొత్తగట్టు టోల్ ప్లాజా వద్ద వాహనాల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఈ హైవే అందుబాటులోకి రావడంతో కరీంనగర్, వరంగల్ మధ్య ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ లభించనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!