

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ రెండేళ్ల పదవీకాలంలో పార్టీ సంస్థాగత బలోపేతం, సామాజిక న్యాయం, ప్రభుత్వం–పార్టీ సమన్వయంపై దృష్టి సారించారు. బీసీ కులగణన, క్షేత్రస్థాయి కేడర్ బలోపేతానికి ప్రాధాన్యం ఇచ్చారు. వికారాబాద్‌లో డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికల విజయాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.
సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా వికారాబాద్‌లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరాన్ని భారీ స్థాయిలో నిర్వహించడం సంస్థాగతంగా కీలక కార్యక్రమంగా నిలిచింది. ఈ శిబిరానికి రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మహేష్‌కుమార్ గౌడ్ పనితీరును ప్రశంసించడం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాల కార్యవర్గ సమావేశాలకు స్వయంగా హాజరై నియామక పత్రాలు అందించడం, మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాలు, పాదయాత్రల ద్వారా రాష్ట్ర నాయకత్వం–క్షేత్రస్థాయి కేడర్ మధ్య అనుసంధానాన్ని పెంచే ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం, నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, స్థానిక సంస్థల్లో సాధించిన విజయాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఈ విజయాలను సంస్థాగత బలంగా మలచడం, గ్రామస్థాయిలో కేడర్‌ను మరింత పటిష్టం చేయడం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!