

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు అదనపు ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. గతంలో కేటాయించిన ఇళ్లకు అదనంగా ఈ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. మొత్తం రెండు కోట్ల ఇళ్లలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు ఐదు లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు మూడు లక్షల ఇళ్లు, తెలంగాణకు రెండు లక్షల ఇళ్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.1.75 లక్షలు అందిస్తోందని చెప్పారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేటాయించిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారని పెమ్మసాని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం 1.75 లక్షల ఇళ్లను కేటాయిస్తే, కేవలం 42 వేల ఇళ్ల నిర్మాణం మాత్రమే చేపట్టారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు ఇళ్లను కేటాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లు పెమ్మసాని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!