

శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మంగళవారం జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పును నిర్ణీత సమయంలో సవాలు చేయలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషన్ ఆలస్యంగా దాఖలు చేయడంతో దీనిని విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది.
దీంతో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇదే కేసులో గతంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారానికి సంబంధించి హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను ఆలస్యంగా దాఖలు చేసిన కారణంతో స్వీకరించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!