

ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్యుడిలా ఆకస్మికంగా సందర్శించారు. ఓ రిటైర్డ్ టీచర్ స్థల వివాదానికి సంబంధించి కొన్ని రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎమ్మెల్యేను ఆశ్రయించారు. దీంతో స్పందించిన బాలరాజు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సామాన్యుడిలా కార్యాలయానికి వెళ్లి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
కార్యాలయంలో ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవలు, అధికారుల పనితీరును ఎమ్మెల్యే పరిశీలించారు. సామాన్య ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటున్నారా, సేవలు సకాలంలో అందుతున్నాయా అనే అంశాలపై ఆరా తీశారు. సుమారు గంటపాటు కార్యాలయంలోనే ఉండి పలు అంశాలను నిశితంగా గమనించారు. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే బాలరాజు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!