

కొండా సుస్మిత వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ అంశంపై ఆరా తీశారు. దీనికి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నుంచి పూర్తి నివేదికను కోరినట్లు సమాచారం. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే సుస్మిత వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇంఛార్జి నివేదిక కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశంగా దీనిని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మహేశ్ కుమార్ గౌడ్ సమర్పించే నివేదికను పరిశీలించిన అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో కొండా సుస్మిత వ్యవహారంలో అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!