
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం కేరళకు వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడి ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో సుమారు 20 రోజుల పాటు ఉండి చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకు ఈ విరామం తీసుకోనున్నట్లు సమాచారం. కేరళలో ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యానికి సంబంధించిన పలు చికిత్సా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఆరోగ్య పునరుద్ధరణపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కేరళ పర్యటన సందర్భంగా ఆయుర్వేద చికిత్స తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం దాదాపు మూడు వారాల పాటు ఆయన చికిత్సా కేంద్రంలో ఉండే అవకాశం ఉంది. అయితే చికిత్సా కేంద్రం పేరు, అందించే వైద్య విధానం వంటి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!