
సినిమాలు

బిహార్‌లోని దర్భంగా విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి వచ్చిన ఈ విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా టైర్ పేలిపోయింది. వెంటనే పైలట్లు అప్రమత్తంగా స్పందించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
విమానంలో ఉన్న 150 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించామని అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదే ఎయిర్‌పోర్టులో ఆకాశా ఎయిర్ విమానానికి కూడా సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో దర్భంగా విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!