
క్రీడలు

తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన అన్ని సేవలు నేటి నుంచి మూడు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ మరియు అనుబంధ ఆన్‌లైన్ సేవలకు సర్వర్ నిర్వహణ పనులు చేపట్టడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.
రేపు ఒక్కరోజు మాత్రమే పనిదినంగా ఉండగా, 28న ఆదివారం, నేడు మొహర్రం సెలవులు కావడంతో సేవలకు అంతరాయం కలగనుంది. 29వ తేదీ నుంచి అన్ని సేవలు యథావిధిగా ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఐదేళ్ల తర్వాత సర్వర్ నిర్వహణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!