
జనరల్

మహారాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్ట (ఆర్‌టీఐ) నిబంధనల్లో చేసిన సవరణలను వెంటనే ఉపసంహరించకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు. ఈ సవరణలు ఆర్‌టీఐ చట్టం 2005 స్ఫూర్తిని దెబ్బతీస్తాయని, ప్రజలను సమాచార హక్కు నుంచి దూరం చేస్తాయని ఆయన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఫీజులు ఎలాంటి స్పష్టత లేకుండా పెంచడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్‌టీఐ అనేది ఆదాయ సేకరణ చట్టం కాదని స్పష్టం చేసిన హజారే, అవసరమైతే సమాచారాన్ని ఇవ్వని అధికారులపై పెనాల్టీలను కూడా పెంచాలని సూచించారు. పారదర్శకతను బలహీనపరిచే నిబంధనలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!