
రాజకీయాలు

అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయగడ నుంచి ద్రాక్షారామం వెళ్తున్న కారు నక్కపల్లి సమీపానికి రాగానే ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన క్రమంలో కారు వెనుక నుంచి ట్రాక్టర్‌ను ఢీకొని అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ప్రవీణ్, రాజ్‌కుమార్, పద్మావతి, ఓ బాలుడు, అలాగే ట్రాక్టర్ డ్రైవర్ అప్పలనాయుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డవగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!